Natural ways to reduce acne using face masks:
మొటిమలు కొద్ది రోజులకి తగ్గిపోతాయి. కానీ, మొటిమల వలన ఏర్పడే మచ్చలు కొన్ని వారాలపాటు చర్మంపైనే తిష్ట వేస్తాయి. ఈ మొండిమచ్చల నుంచి ఉపశమనం దక్కడం అత్యంత క్లిష్టమైన పని. అయినప్పటికీ, ఆయుర్వేద రెమెడీలను సరైన విధంగా పాటించడం ద్వారా వీటినుంచి విముక్తి పొందటం మరింత సులభం.
బ్లాక్ హెడ్స్ తో టీనేజ్ మూడ్ ఆఫ్:
చిట్కాలు మార్కెట్ లో మొటిమల మచ్చలను నివారించే అనేకరకాలైన ప్రాడక్ట్స్ లభ్యమవుతాయి. అయితే, ఇవన్నీ వంద శాతం సురక్షితమని చెప్పలేము. కాబట్టి, ఈ రోజు బోల్డ్ స్కైలో, వందశాతం సురక్షితమైన, అలాగే పాటించడానికి సులభమైన ఆయుర్వేదిక్ రెమెడీస్ గురించి వివరిస్తున్నాము. ఈ ఆయుర్వేదిక్ ఫేస్ మాస్క్స్ ని వాడి మొటిమల మచ్చల నుంచి ఉపశమనం పొంది మీ చర్మ సౌందర్యాన్ని పరిరక్షించుకోండి.
మచ్చలేని చర్మాన్ని తిరిగి పొందేందుకు ఈ చిట్కాలను పాటించండి.
1. శాండల్వుడ్ పౌడర్ మరియు ఆల్మండ్ ఆయిల్ ఫేస్ మాస్క్
ఒక టీస్పూన్ శాండల్వుడ్ పౌడర్ ను తీసుకుని అందులో రెండు టీస్పూన్ల ఆల్మండ్ ఆయిల్ ను జోడించండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై మాస్క్ లా అప్లై చేసి పది నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరచుకోండి. ఈ ఫేస్ మాస్క్ ని వారానికి మూడు నాలుగు సార్లు అప్లై చేయడం ద్వారా మొటిమల మచ్చల నుంచి ఉపశమనం పొందవచ్చు.
2. పసుపు మరియు పాల ఫేస్ మాస్క్
అర టీస్పూన్ పసుపు పొడిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిపాలను కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై పలుచని పొరగా అప్లై చేసి అయిదు నుంచి పదిహేను నిమిషాల వరకు అలాగే ఉంచండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని కడగండి. ఈ ఆయుర్వేదిక్ ఫేస్ మాస్క్ ని వారానికి రెండుసార్లు వాడటం ద్వారా చర్మాన్ని సంరక్షించుకుని మొటిమల మచ్చలకు గుడ్ బై చెప్పవచ్చు. ఆయుర్వేద గృహవైద్యా చిట్కాలతో సౌందర్యం మీ సొంతం…
3. శనగపిండి మరియు తేనె ఫేస్ మాస్క్
ఒక గ్లాస్ బౌల్ ని తీసుకుని అందులో అర టీస్పూన్ శనగపిండిని అలాగే ఒక టేబుల్ స్పూన్ తేనెని కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై మాస్క్ లా అప్లై చేయండి. అయిదు నుంచి పది నిమిషాలవరకు ఈ మాస్క్ ను సహజసిద్ధంగా ఆరనివ్వండి. ఆ తరువాత తేలికపాటి క్లీన్సర్ తో ఈ మాస్క్ ను తొలగించండి. వారానికి రెండు నుంచి మూడు సార్లు ఈ మాస్క్ ని వాడటం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
4. బంతిపువ్వు మరియు రోజ్ వాటర్ ఫేస్ మాస్క్
రెండు నుంచి మూడు బంతిపూల రెక్కలను మెత్తగా నూరండి. ఈ పొడిలో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ ను కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై అద్ది పదినిమిషాలపాటు అలాగే ఉంచండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి. వారానికి రెండుసార్లు ఈ పద్దతిలో మీ చర్మాన్ని సంరక్షిస్తే మొటిమల మచ్చలు కనుమరుగవుతాయి.
5. వేపాకులు మరియు అలోవెరా జెల్ ఫేస్ మాస్క్
గుప్పెడు వేపాకులను బ్లెండర్ లో వేసి పొడిని తయారుచేసుకోండి. అర టీస్పూన్ వేపాకుల పొడిలో రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ ను కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోండి. ఈ మిశ్రమాన్ని సమస్యాత్మక ప్రదేశంపై మాస్క్ లా అప్లై చేసుకోండి. అయిదు నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోండి. ఈ హోమ్ రెమెడీని వారానికి మూడు నుంచి నాలుగు సార్లు పాటించడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు.
6. ముల్తానీ మట్టి మరియు కొబ్బరి నూనె ఫేస్ మాస్క్
ఓక పాత్రను తీసుకుని అందులో ఒక టీస్పూన్ ముల్తానీ మట్టిని అలాగే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై అద్దండి. పదినిమిషాల తరువాత ప్రభావిత ప్రదేశాన్ని శుభ్రపరచండి. వారానికి రెండుమూడుసార్లు ఈ పద్దతిని పాటిస్తే మొటిమల మచ్చలు తగ్గిపోతాయి.
7. ఆలివ్ ఆయిల్ మరియు నిమ్మరసం ఫేస్ మాస్క్
ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసాన్ని కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోండి. ఈ మిశ్రమాన్ని మొటిమల మచ్చలపై అద్ది పదినిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ప్రభావిత ప్రదేశాన్ని రుద్దండి. ఈ మాస్క్ ని వారానికి నాలుగైదు సార్లు వాడడం ద్వారా మొటిమల మచ్చలను నిర్మూలించవచ్చు.