Newly married couple did not accept gifts from relatives instead: వివాహం అంటే ఎవరి జీవితంలో అయినా ఒకేసారి వచ్చే అతి ముఖ్యమైన ఘట్టం. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి నడుమ వివాహ వేడుకలను ఎవరైనా జరుపుకుంటారు.

ఆ సమయంలో ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. అలాంటి ఆనంద సమయంలో జీవితాంతం గుర్తుండి పోయేలా ఏదైనా సమాజహిత కార్యం చేస్తే.. ఇక అంతకు మించిన ఆత్మ సంతృప్తి మరొకటి ఉండదు కదా. అవును, కరెక్టే. సరిగ్గా ఆ డాక్టర్ దంపతులు కూడా అదే చేశారు. ఇంతకీ అసలు వారు ఏం చేశారంటే…వారి పేర్లు డాక్టర్ ప్రతీక్ రౌత్, డాక్టర్ ఉత్తర దేశ్ పాండే. వీరిద్దరూ డాక్టర్లే. ఉంటున్నది పూనెలో. ఈ క్రమంలోనే పెద్దల అంగీకారం మేరకు డిసెంబర్ 24, 2017న పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి సందర్భంగా వీరు తమ పెళ్లికి వచ్చిన గెస్ట్‌లకు ఒక రిక్వెస్ట్ చేశారు. అదేమిటంటే.. తమ తమ అవయవాలను దానం చేయాలని అడిగారు. ఇందుకు కొందరు స్పందించారు కూడా. మొత్తం 1000 మంది హాజరైతే వారిలో 25 మంది మాత్రమే అవయవాలను దానం చేయడానికి ఒప్పుకున్నారు. అయినప్పటికీ మిగిలిన వారు కూడా అందుకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు.

Newly married couple did not accept gifts from relatives instead:
అయితే ఈ డాక్టర్ దంపతులు ఈ కార్యక్రమాన్ని తమ పెళ్లి రోజు జరిపితే బాగుంటుందని, దీనికి తోడు పెద్ద ఎత్తున అవయవ దానం చేయించవచ్చని అనుకున్నారు. అందులో భాగంగానే రీబర్త్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వారు ఈ పని చేశారు. వారు ఇలా ఎందుకు చేశారంటే.. స్వయానా డాక్టర్లు కావడం చేత అనేక మంది అవయవాలు దొరక్క చనిపోవడం చూశారు. దీంతో జనాల్లో అవయవ దానంపై అవగాహన కలిగేందుకు వారు ఈ పని చేశారు. మరణించిన మనిషి శరీరం నుంచి తీసే అవయవాలతో 8 మందికి సహాయం చేయవచ్చు అనే నినాదంతో వీరు అవయవ దాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందుకు వీరిని మనం నిజంగా అభినందించాల్సిందే కదా..!