
దానాలన్నింటిలోను అన్నదానం మహాశ్రేష్టం (అన్నం పరబ్రహ్మ స్వరూపమని అంటారు) అందువలన అటువంటి దానిని వృధా చేయకూడదు. దానంగా ఎవరైనా ఏదైనా ఇస్తే, ఇంకా ఇస్తే బాగుండును అనిపిస్తుంది కాని అదే అన్నం దానంగా ఇస్తే ఎంత వరకు కావాలో అంతే మనము తినగాలుగుతాం కాబట్టే అన్నదానం శ్రేష్టమన్నారు. మనము శబరియాత్ర చేసే దారిలో ఎరుమేలి, పెరియానపట్టం, పంబా గణపతి మరియు ఆలయపు సన్నిదానము దగ్గరలో ఎన్నియో సంస్థలు జాతి, మత, కుల, గుణ, వర్ణ, వర్గ, భాషా భేదాలు లేక అందరిని అయ్యప్ప యొక్క ప్రతిరూపంగా భావించిన ప్రేమతో పిలిచి కడుపునిండా ఆహారం అంద చేస్తున్నారు.
ఈ సౌకర్యమును అందరూ వినియోగించుకొనగలరు. స్వాములు తమతమ ఇరుముడులతో బాటు అన్నదానములకు కావలసిన బియ్యం, పప్పు, ఉప్పు, రవ్వ, చక్కర లాంటి ఏదైనా కొంతవరకు విడిగా తమ సైడు బ్యాగుల్లో తీసుకొని వెళ్లి, ఈ శబరిమలై యాత్రా శిబిరములలో ఎక్కడైనా అందజేసి శ్రీ అయ్యప్ప స్వామి వారి కటాక్షములకు పాత్రులు కాగలరు. శక్తిగలవారు ధనరూపేణ కుడా వారికి తోచిన విధంగా సహకరించి, అన్నదాన శిబిరములకు నిర్విరామముగా కొనసాగుటకు తోడ్పాటు అందించగలరు.
అన్నదానం ప్రయోజనాలు
- ఇది దైవిక ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది.
- ఇది గత కర్మలను తొలగించడానికి సహాయపడుతుంది.
- ఇది ఒకరికి సంతృప్తిని ఇస్తుంది.
- అన్నదానం స్వీకరించిన వారి ఆశీస్సులు అన్నదానం చేసిన వారి జీవితంలో సానుకూలతను తెస్తాయి.
- అన్నదానం వలన పూర్వీకులను సంతోషపరుస్తుందని, వారికి మోక్షాన్ని పొందడంలో సహాయపడుతుందని కొంతమంది భావిస్తారు.
- క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమాలు చేస్తే, జీవితంలో అన్ని రంగాలలో అపారమైన ప్రయోజనాలను పొందవచ్చని కొంతమంది నమ్మకం.
ఇలా అన్నదానం వలన అనేక ప్రయోజనాలను ఉన్నాయి.