కానీ ఎప్పుడన్నా ఆలోచించారా గంగానది కలుషితం అయినా కూడా, దాన్ని ప్రభుత్వం శుభ్రం చేసే ప్రాజెక్టులు టివీలో మనకి కన్పిస్తూనే ఉన్నా, మీకు తెలుసా గంగానది నీరు ఎన్నటికీ అపవిత్రం కాలేదని? “ఈ బరువు తగ్గే చిట్కా నా జీవితాన్ని మార్చేసింది,”అంటున్న అనాయా
మీరు ఎప్పుడన్నా పర్వతాల వైపుకి వెళ్ళిఉంటే ,గంగానది గంగోత్రిలోని ఖత్లింగ్ మరియు సతోపంత్ గ్లేసియర్ ల నుంచి కరిగిన మంచు నుంచి పుట్టినదని తెలుస్తుంది. ఈ నీరు కేదార్ నాథ్, నందాదేవి మరియు ఇతరపర్వతాల నుంచి వచ్చిన నీరుతో కలుస్తుంది. ఈ గ్లేసియర్ల చుట్టూ పెరిగే అనేక మొక్కల జాతులకి ఆరోగ్యవిలువలుండి బ్యాక్టీరియా, ఇతర కలుషితాలను చంపేస్తాయి. అందుకే ఈ నీరు చాలాకాలం పాటు తాజాగా ఉంటుంది. మరొక కారణం శాస్త్రీయమైన కారణంగా చెప్పుకోవచ్చు.
బ్యాక్టీరియోఫేజ్ అనే వైరస్ గంగానదిలో ఉంటుంది, ఇది గంగానదిలోకి వచ్చే ఇతర హానికర బ్యాక్టీరియాలను చంపేస్తుంది. మరొక వివరణ ఏంటంటే హిమాలయాలలో గంగ్నాని నుంచి గంగోత్రి వరకూ ప్రవహించేటప్పుడు, గంగానదిలోకి వేడినీటి బుగ్గలనుంచి వస్తున్న జలపాతాలు వచ్చి కలుస్తాయి, అందులోని సల్ఫర్ గంగానదిలోని బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఈ శాస్త్రీయ వివరణలు చాలానే ఉండొచ్చు,కానీ గంగానది పవిత్రతపై మాత్రం సందేహం ఎన్నటికీ ఉండబోదు.